కింగ్‌డమ్…సెన్సార్ పూర్తి

6
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కింగ్‌డమ్. జూలై 31న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ (U/A) సర్టిఫికెట్ ఇచ్చిన‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న విష‌యం తెలిసిందే. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Also Read:ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు సంచలన తీర్పు..

- Advertisement -