కింగ్‌ ఆఫ్‌ కోథా…మాసివ్ ఎంటర్ టైనర్

29
- Advertisement -

దుల్కర్‌ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్నారు. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో వుంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 24న విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
కెరీర్ బిగినింగ్ నుంచి మలయాళంలో సినిమాలు చేస్తున్నాను. ఎప్పటి నుంచో దుల్కర్‌ తో సినిమా చేయాలని వుండేది. ఇది వరకు కొన్ని ప్రాజెక్ట్స్ కోసం చర్చలు జరిగాయి కానీ కుదరలేదు. ఫైనల్ గా ఈ సినిమాతో కుదిరింది. దర్శకుడు అభిలాష్ జోషి ఈ సినిమా స్కేల్ గురించి చెప్పినపుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. చాలా బిగ్గెస్ట్ సినిమా. ప్రొడక్షన్ పరంగా భారీ చిత్రం. చాలా మాసీవ్ సెట్స్ వేశాం. ప్రతి షాట్ చాలా నిండుగా వుంటుంది. అచ్చమైన తెలుగు సినిమాలా వుంటుంది. ఇంతపెద్ద స్కేల్ లో మలయాళీ సినిమాలో భాగం కావడం నాకు ఇదే తొలిసారి. చాలా మంచి టీం , బెస్ట్ టెక్నిషియన్స్ తో కలసి ఈ సినిమా చేశాం. నేను పని చేసిన చిత్రాలలో ఇదొక బెస్ట్ ప్రొడక్షన్స్ హౌస్.

ఇలాంటి సినిమాల్లో హీరోయిన్ స్క్రీన్ టైమ్ తక్కువగా వుంటుంది.. మీ పాత్ర ఎలా వుండబోతుంది?
ఇందులో చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తాను. మట్టికుస్తీ లాంటి చిత్రాలలో పోల్చుకుంటే ఇందులో నా పాత్ర స్క్రీన్ టైం తక్కువగానే ఉన్నప్పటికీ కథలో చాలా ప్రాధన్యత వుంటుంది. పోన్నియన్ సెల్వన్ లో నా పాత్ర సినిమా అంతా లేకపోవచ్చు, కానీ ఆ చిత్రంలో గుర్తుపెట్టుకునే పాత్రల్లో అదొకటి. కింగ్‌ ఆఫ్‌ కోథా లో కూడా అలాంటి ప్రాధాన్యత వున్న పాత్ర చేస్తున్నాను. నా పాత్రతో ఈ కథకు ఒక పరిపూర్ణత వస్తుంది.

మీ పాత్రలో ఛాలెంజింగా అనిపించిన అంశాలు ఏమిటి ?
ఎమోషనల్ సీన్స్ చేసినప్పుడు చాలా ఛాలెంజింగా అనిపించింది. ఇందులో నా పేరు తార. దుల్కర్ పేరు రాజు. వారి మధ్య అందమైన లవ్ స్టొరీ కూడా వుంది. చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఈ లవ్ స్టొరీ కి బ్రిలియంట్ మ్యూజిక్ ట్రాక్ వుంటుంది. ఇది రాజు చుట్టూ తిరిగే కథ. అందులో నా పాత్ర చాలా కీలకంగా వుంటుంది.

మీరు సినిమా చేయడానికి ఆసక్తిని కలిగించిన అంశాలు ఏమిటి ?
ఒక్క మాట లో చెప్పాలంటే.. దుల్కర్‌ సల్మాన్. అలాగే కథ, స్కేల్ చాలా గ్రాండ్ గా వుంటుంది. చాలా మంది వెటరన్స్ తో కలసి పని చేసే అవకాశం దొరికింది.

ఈ కథ ఫిక్షనా.. లేదా యధార్థ సంఘటనలు ఆధారంగా తీశారా ?
ఇది ఫిక్షనల్ స్టొరీ. కోథా అంటే టౌన్ అని అర్ధం. అదొక ఫిక్షనల్ టౌన్. ఐతే యధార్థ పరిస్థితులని ప్రతిబింబిస్తుంది. చాలా గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

కొత్త దర్శకుడు అభిలాష్ జోషి ఈ కథ చెప్పినపుడు ఎలా అనిపించింది ?
మట్టికుస్తీ షూటింగ్ సమయంలో ఈ కథని చెప్పారు. చాలా లాంగ్ నేరేషన్ ఇచ్చారు. నా పాత్రే కాదు సినిమాలోని అన్ని పాత్రలని వివరించి చెప్పారు. ఆయన చెప్పినప్పుడే కథని విజువలైజ్ చేసుకున్నాను. ఏవైనా సందేహాలు అడిగినా ఎంతో వివరంగా నివృత్తి చేశారు. కొత్త దర్శకుడైనప్పటికీ ఎంతో అనుభవం వున్న దర్శకుడిలా ఈ చిత్రాన్ని తీశారు. ప్రతి విషయం పట్ల అతనకి చాలా క్లారిటీ వుంది. అభిలాష్ తండ్రి గారు జోషియా వెటరన్ డైరెక్టర్. ఆయన చిత్రాలకు నేను ఫ్యాన్ ని. సెట్స్ లో సమయం కుదిరినప్పుడు ఆయన చిత్రాల గురించి మాట్లాడుకునేవాళ్ళం.

దుల్కర్‌ సల్మాన్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
దుల్కర్‌ సల్మాన్ ట్రూ జెంటిల్ మెన్. తనతో మాట్లాడితే ఏదైనా నేర్చుకునేలా వుంటుంది. ఏదైనా సలహా అడిగితే హెల్ప్ చేస్తారు. చాలా వినయంగా వుంటారు. నాకే కాదు దుల్కర్‌ తో వర్క్ చేయడం ఎవరికైనా ఆనందంగా వుంటుంది. ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవిస్తారు.

సినిమా నిర్మాతల గురించి ?
దుల్కర్‌, వేఫేరర్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. ఈ సినిమాలో ప్రతిది రిచ్ గా వుంటుంది. ఎక్కడ రాజీపడకుండా కథకు కావాల్సింది సమకూర్చారు. నటీనటులందరినీ ఎంతో మర్యాదగా చూసుకున్నారు.

ఈ చిత్రం మ్యూజిక్ గురించి ?
ఇందులో రెండు పాటలు వున్నాయి. షాన్ రోమన్ ఒక పాట చేశారు. మరో పాట, నేపధ్య సంగీతం జేక్స్ బిజోయ్ చేశారు. మ్యూజిక్ బ్రిలియంట్ గా వుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు.

Also Read:స్కిన్ అలర్జీ..అయితే జాగ్రత్త!

మీరు ఎలాంటి చిత్రాలు చేయాలని అనుకుంటారు?
నాకు అన్ని రకాల చిత్రాలు చేయాలని వుంటుంది. దసరా సినిమా నాకు చాలా నచ్చింది. అందులో కీర్తి సురేష్ పాత్ర నాకు చాలా ఇష్టం. అలాంటి పాత్ర చేయాలని వుంటుంది. అలాగే మహానటి సినిమా కూడా చాలా ఇష్టం. సమంత గారి సినిమాలు కూడా ఇష్టం. ఓ బేబీ నా ఫేవరేట్. అలాగే సాయి పల్లవి కూడా చాలా ఇష్టం. ఫిదా రెండు సార్లు థియేటర్ లో చూశాను. నటనతో పాటు డ్యాన్స్ తో కట్టిపడేశారు. శ్రీలీల డ్యాన్స్ ని చాలా ఎంజాయ్ చేస్తాను.

తెలుగులో మీకు ఇష్టమైన హీరో ? హీరోయిన్ ?
అల్లు అర్జున్ గారు. తన స్టయిల్ తో ప్రేక్షకులని కట్టిపడేస్తారు. హీరోయిన్స్ విషయానికి వస్తే సమంత, సాయి పల్లవి మధ్య టై పడుతుంది( నవ్వుతూ). అలాగే రీసెంట్ గా శ్రీలీల అంటే కూడా ఇష్టం.

మీ నిర్మాణంలో సినిమాలు చేస్తున్నారా ?
గార్గి, కుమారి చిత్రాలు నిర్మాతగా ఆనందాన్ని ఇచ్చాయి. అయితే మరో ఏడాదిన్నర పాటు నిర్మాణంపై ఆలోచనలు లేవు.

కొత్తగా చేస్తున్న చిత్రాలు ?
తమిళంలో ఓ సినిమా చేస్తున్నా. త్వరలోనే అనౌన్స్ మెంట్ వస్తుంది. మరికొన్ని కథలు వింటున్నా.

డ్రీమ్ రోల్స్ ఉన్నాయా ?
డ్రీమ్ రోల్స్ అంటూ ప్రత్యేకంగా లేవు, కానీ నేను చేసి పాత్రలు గుర్తుండిపోయేలా ఉండాలని కోరుకుంటాను. నిజానికి అదే పెద్ద డ్రీమ్. దాని కోసం ఒకొక్క అడుగూ వేసుకుంటూ వెళ్తున్నాను.

Also Read:స్కిన్ అలర్జీ..అయితే జాగ్రత్త!

- Advertisement -