సుగంధాల రారాజు…లవంగం

247
- Advertisement -

భారతీయ వంటకాలల్లో మసాలాదినుసులది ప్రత్యేక స్థానం. ప్రతి ఇంటిలో మసాలాదినుసులు తప్పనిసరిగా ఉంటాయి. అవి లేని ఇళ్లు దాదాపుగా ఉండదు. అటువంటి మసాలాదినుసులలో రారాజుగా పెరొందిన మసాలా..లవంగం. లవంగాలు లేకుండా ఏవంటకం వండరు. లవంగాలను వాటి పూలమొగ్గల నుంచి తయ్యారయ్యే లవంగం గుమగుమలాడే సువాసనలను అందిస్తుంది. బిర్యానీ మాంసం ఆకుకూరలు బేకరీ ఐటమ్స్ చాయ్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టూ చాలానే ఉంటుంది.

పూర్వం బ్రిటీష్ వారు యూరోప్‌ వారు భారతదేశానికి రావడానికి ప్రధాన కారణం భారతీయ మసాలా దినుసులు. అయితే ఇది కేవలం వంటింట్లోనే కాదు ఆయుర్వేదంలో కూడా దీన్ని వాడుతారు. ఎంతలా ఉపయోగపడుతుందంటే దాన్ని వర్ణించడం చాలా కష్టం. నొప్పి నివారణిగా, జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. అలాగే శ్వాసకోస సమస్యలను సైతం నివారిస్తుంది. ఇంకా ఈ లవంగాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన అద్భుతమైన ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • మార్నింగ్ సిక్‌నెస్‌తో బాధపడేవారు లవంగాలను ఖాళీ కడుపుతో నమలడం వలన ప్రయోజనం ఉంటుంది. వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • నోటి వాపు, చిగురువాపు, నోటి దుర్వాసన నివారణకు అద్భుతంగా సహాయపడుతుంది.
  • హెపటైటిస్ సమస్యను తగ్గిస్తుంది.
  • దంతాల నొప్పి నివారణిగా పనిచేస్తుంది. ఉదయాన్నే లవంగాలు తినడం వలన నోటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
  • కొత్త కణాల పెరుగుదల, కాలేయ నిర్విషీకరణను ప్రోత్సహిస్తుంది. ఇందులోని థైమోల్, యూజినాల్ వంటి క్రియాశీల సమ్మేళనాల కారణంగా రక్షణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
  • ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
  • లవంగాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణ రసాల స్రావాన్ని ప్రోత్సహించి, కడుపు ఉబ్బరం సమస్యలకు చెక్ పెడుతుంది.
  • ఖాళీ కడుపుతో చిటికెడు లవంగాల పొడిని తీసుకోవడం వలన డయాబెటిక్ పేషెంట్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుతుంది.
  • లవంగాలలో మాంగనీస్, ఫ్లేవనాయిడ్స్ వంటి మూలకాలు ఉన్నాయి. ఇవి ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తాయి. ఈ మూలకాలు కణజాలం మరమ్మతులో సహాయపడుతాయి. తద్వారా కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.
  • ఇవే కాకుండా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నేచురల్ పెయిన్‌కిల్లర్‌గా పని చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

 Also Read:వేసవిలో చెరుకురసం తాగుతున్నారా?

- Advertisement -