కొన్ని నెలల క్రితం అమెరికన్ టీవీ హీరోయిన్ కిమ్ కర్దాషియాన్ మీద ఇటీవల పారిస్ హోటల్ లో దోపిడి జరిగిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున కిమ్ గదిలోకి ఐదుగురు దుండగులు పోలీసులమంటూ చొరపడ్డారు. ముసుగులు వేసుకొని వచ్చిన వారు కిమ్‌కు తుపాకీ గురి పెట్టి.. ఆమె వద్దనున్న మిలియన్ డాలర్ల విలువైన నగల్ని దోచుకెళ్లారు.
పారిస్ లో జరిగిన ఈ దోపిడీ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐదు నెలల క్రితం జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు పెదవి విప్పిన కిమ్.. ఆ రోజున తాను తనను రేప్ చేస్తారని మానసికంగా ప్రిపేర్ అయిపోయినట్లు చెబుతోంది.
అప్పటి ఘటనకు సంబంధించిన విషయాలను కిమ్ బయటపెట్టింది. ‘అర్థరాత్రి సమయంలో నా గదిలోకి వచ్చిన దుండగులు గన్‌తో నన్ను బెదిరించారు. వెనుక వైపు మెట్ల గుండా పారిపోదామా అనే ఆలోచన వచ్చింది. అయితే తుపాకీతో కాల్చేస్తారేమోననే భయం వేసింది. నా అరుపులు వినబడకుండా నా నోటికి టేప్ వేశారు. ఒకడు నా కాళ్లు పట్టుకుని లాగాడు. బెడ్ మీద కూర్చుని నన్ను తన వైపునకు లాగాడు.
అప్పుడు నేను లో దుస్తులు కూడా వేసుకోలేదు. అతను నన్ను రేప్ చేయబోతున్నాడని అనుకున్నాను. రేప్ చేస్తాడని మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయాను. అయితే అతను ఆ పని చేయలేద’ని తెలిపింది కిమ్ కర్దేషియాన్. దుండుగులు బంధించినపుడు తాను ఏం చేసుంటే బాగుండేదనే విషయంలో ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నానని చెప్పింది.