యాంటీ బయోటిక్స్‌ ఎక్కువగా వాడితే!

6
- Advertisement -

మనం ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి రోగ నిరోధక శక్తి ఒక కొలమానంగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గితే మనకు తెలియకుండానే ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఆ తరువాత వాటి నుంచి బయట పడేందుకు వైద్యులను సంప్రదించడం, మెడిసిన్స్ వాడడం వంటివి చేస్తుంటారు. అయితే అనవసరంగా మెడిసిన్స్ తీసుకోవడం కూడా మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.

రోగ నిరోధక శక్తి లోపిస్తే ఎలాంటి సమస్యలు ఉత్పన్నమౌతాయో, ఎక్కువగా యాంటీ బయాటిక్స్‌ ఉపయోగించడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా పిల్లల్లో ఇది ఉబ్సం వ్యాధికి దారితీసే ప్రమాదం ఉంది.

ఆస్ట్రేలియాకు చెందిన ‘మోనాష్‌ యూనివర్సిటీ’ పరిశోధకులు ఎలుకలపై రీసెర్చ్ చేసి ఈ విషయాన్ని బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.60 కోట్ల మంది ఆస్తమాతో ఇబ్బందిపడుతున్నారని, ఈ వ్యాధితో ఏటా 4.55 లక్షల మంది చనిపోతున్నారని వెల్లడైంది. ఐదేళ్లలోపు పిల్లల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్లకు 90% కారణం వైరస్‌లే.

పిల్లలకు చిన్న వయసులోనే పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ కీలక దశలో తల్లిపాలు పట్టడంతోపాటుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిచాల్సి ఉంటుంది. తద్వారా పిల్లల ఎదుగుదలకు, రోగ నిరోధకశక్తి చక్కగా పనిచేయడానికి ఈ బ్యాక్టీరియా తొడ్పడుతుంది. అయితే, యాంటీబయాటిక్స్‌ అధికంగా వాడితే పేగుల్లోని మంచి బ్యాక్టీరియకు కూడా నష్టం జరుగుతుంది. ఆస్తమాకు ఇన్‌హేలర్లను వాడితే పిల్లలకు అలవాటై పోతాయనే అపోహ కొందరు తల్లిదండ్రుల్లో ఉందని అందుకని సిరప్‌లు ఇవ్వాలని అడుగుతుంటారని తెలిపారు. కానీ వాటికంటే ఇన్‌హేలర్లే ఎక్కువ రక్షణ ఇస్తాయని పేర్కొన్నారు. శీతల వాతావరణం, చల్లటి, ఉబ్బసం కారక పదార్థాలకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.

Also Read:‘బఘీర’ …ఫస్ట్ సింగిల్

- Advertisement -