కిడ్నీలో రాళ్ళు పోవాలంటే..!

75
- Advertisement -

మన శరీర భాగాలన్నిటిలో కిడ్నీలు చాలా ముఖ్యమనవి. రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను బయటకు పంపించడంలో మూత్రపిండాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. అయితే నేటి రోజుల్లో కిడ్నీ సంబందిత వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడడం, కిడ్నీల వాపు వంటి సమస్యలు ఏర్పడి వాటి పని తీరును మందగించేలా చేస్తాయి. అయితే మూత్రపిండాలకు సంబంధించి ఎలాంటి సమస్యలైన అందులో రాళ్ళు ఏర్పడడం మూలంగానే వాటి ప్రభావం అధికమౌతుంటుంది. మరి మూత్రపిండల్లో రాళ్ళు ఏర్పడడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరానికి అవసరమైన రీతిలో నీళ్ళు త్రాగకపోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది.

ఇంకా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. అయితే కిడ్నీలో రాళ్ళ సమస్యను చాలమంది సరిగ్గా అంచనా వేయలేరు. పక్కటేముకల కింద వైపు వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి, మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పిగా ఉండడం, మూత్రం పింక్, ఎరుపు, గోదుమ రంగులో ఉండడం, ఇంకా వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతే కాకుండా తరచూ మూత్ర విసర్జన చేయడం, తేలికపాటి జ్వరం, చలిగా ఉండడం వంటి లక్షణాలు కూడా మూత్రపిండల్లో రాళ్ళు ఉన్నాయనే చెప్పే సంకేతాలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

దీంతో ఈ సమస్యకు సరైన వైద్యం తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కాగా ఇంటి చిట్కాలతో మూత్ర పిండాల ఆరోగ్యన్ని కొంతలో కొంతైనా మెరుగుపరచవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో రెండు టి స్పూన్ ల అల్లం రసం తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరిగి వాటి పనితీరు మెరుగుపడుతుందట. ఇంకా బీట్ రూట్ జ్యూస్ ప్రతిరోజూ తాగడం వల్ల మూత్రపిండాలలోని వ్యర్థాలు తొలగిపోయి క్లీన్ అవుతాయట. ఇక ప్రతిరోజు కొబ్బరి నీళ్ళు త్రాగడం కూడా మూత్రపిండాలకు చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:Gold Price:బంగారం ధర ఎంతంటే?

- Advertisement -