పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అజ్ఞాతవాసి. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ఖుష్బూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ సినిమాకు ముందుకు తమిళంలో ఎన్నో అవకాశాలు వచ్చాయని కానీ వాటన్నింటికి నో చెప్పానని తెలిపింది. ఒక రోజున త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ కథతో మా ఇంటికి వచ్చారు. కథ చెప్పడానికి ముందుగానే ‘మేడమ్, ఈ పాత్రకి మాత్రం మీరు నో చెప్పొద్దు .. ప్లీజ్’ అన్నారు. కథ విన్న తరువాత నా పాత్ర నాకు బాగా నచ్చేసింది. అందువలన వెంటనే ఓకే చెప్పేశానని తెలిపింది.
నా పాత్రకి వస్తోన్న రెస్పాన్స్ నాకు చాలా సంతోషాన్ని .. సంతృప్తిని కలిగిస్తోంది. ఇక పవన్ విషయానికి వస్తే, ఆయన చాలా తక్కువగా మాట్లాడతారు. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో సౌకర్యవంతంగా వుంది అని చెప్పుకొచ్చారు.
నాకు తెలుగు మాట్లాడటం బాగా వచ్చు. కానీ, ఇందులో నా పాత్రకు సరిత అనే అమ్మాయితో డబ్బింగ్ చెప్పించారు. నేను డబ్బింగ్ చెప్పకపోతే సినిమాలో నాకేమైనా పడిన మార్కులు పోతాయా? లేదు కదా!, నా పాత్రకు సరిత లాంటి అమ్మాయి గొంతు సరిగ్గా సరిపోయిందని తెలిపింది.