ఖేలో ఇండియాలో మెరిసిన వేదాంత్‌…

44
- Advertisement -

ప్రముఖ నటుడు ఆర్.మాధవన్‌ కొడుకు వేదాంత్ ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో భాగంగా 5స్వర్ణాలు మరియు 2రజతాలు సాధించారు. ఈ సందర్భంగా ఆర్.మాధవన్ ట్వీట్ చేస్తూ గర్వంగా ఉంది ఫెర్నాండెస్ వేదాంత్ ల యొక్క ప్రదర్శనలకు చాలా కృతజ్ఞతలు మరియు మీరు వినయంతో సాధించిన ఈ ఘనత నిరంతరం కొనసాగాలని ప్రదీప్‌ సార్‌ అద్భుతమైన శిక్షణల మధ్య మరింత ముందుకు వెళ్లాలని ట్వీట్ చేశారు. వేదాంత్‌ మధ్యప్రదేశ్‌లోని ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ 2022లో భాగంగా స్వీమ్మింగ్ విభాగంలో 100మీ, 200మీ, 1500మీ స్వర్ణం, 400మీ, 800మీల్లో రజతం సాధించాడు. వేదాంత్ అంతర్జాతీయంగా కూడా పలు రికార్డులు సాధించారు.

కోపెన్‌హాగన్‌ జరిగిన డానిష్‌ ఓపెన్ స్విమ్మింగ్‌ ఈవెంట్‌లో పురుషుల 800మీటర్లలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అంతకుముందు ఇదే మీట్‌లో 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌లో రజతం సాధించాడు. 2021మార్చిలో లాట్వియా ఓపెన్ స్విమ్మింగ్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. గతేడాది నిర్వహించిన జూనియర్ నేషనల్‌ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో ఏడు పతకాలు (నాలుగు రజతాలు మరియు మూడు కాంస్యాలు) సాధించారు. అయితే గతంలో వేదాంత్‌ యావత్తు భారతదేశ ప్రజలకు పరిచయమైన విధానం చాలా ఆసక్తిని రేకిత్తిస్తుంది. గతంలో డ్రగ్స్‌ కేసులో షారూఖ్‌ఖాన్‌ పోలీసులకు దొరికిన నేపథ్యంలో వేదాంత్ ప్రముఖంగా వార్తల్లో నిలిచారు. ఇద్దరి వ్యక్తుల మధ్య పొలికలను చూపిస్తూ చేసిన ట్రోల్స్‌ విపరీతంగా వైరల్‌ అయినాయి.

ఇవి కూడా చదవండి…

ఒక రోజు వెనక్కి

చెత్త రికార్డు నెలకొల్పిన ఆసీస్..

నగరంలో ముగిసిన ఈ రేసు…

- Advertisement -