రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ కలెక్టర్ ఆవరణంలో మొక్కలు నాటారు.
ఈ సందర్బగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారంకు మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి అన్ని వర్గాల ప్రజలను, రాజకీయ నాయకులూ, సెలబ్రిటీలు, క్రీడాకారులు ఇలా ప్రతి రంగంలో ప్రముఖులను భాగస్వామ్యం చేస్తూ మొక్కలు నాటండి వాటిని ఎదిగే వరకు బాధ్యత తీసుకోండి అనే సందేశాన్ని విజయవంతగా ప్రజలకు చేరవేసిన వ్యక్తి జోగినిపల్లి సంతోష్ కుమార్. మొక్కలు నాటడమే కాదు వాటిని నరికితే జరిమానా కూడా విధిస్తారని ఈ మధ్య ట్విట్టర్ వేదిక రుజువైంది. కావున ఇంత మంచి కార్యక్రమం చేపట్టి , పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమం ఇలానే కొనసాగాలని మరో ముగ్గురికి 1) మహేంధర్ రెడ్డి గారు అడిషనల్ కలెక్టర్ వరంగల్ రూరల్ 2) R. అంజయ్య గారు అడిషనల్ కలెక్టర్ రాజన్న సిరిసిల్ల 3)S.మోతీలాల్ అడిషనల్ కలెక్టర్ వికారాబాద్ గార్లకి ఛాలెంజ్ చేశారు.