- Advertisement -
ఖరీఫ్, రబీ పేర్లను వానాకాలం, యాసంగి గా మారుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర వ్యవసాయ శాఖ. సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో వ్యవసాయ సీజన్లు ఉండేలా వానాకాలం, యాసంగి అనే పదాలనే వాడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇప్పటివరకు సామాన్యులకే కాదు, చదువుకున్న వారికీ ఖరీఫ్, రబీ పదాలను వాడే విషయంలో గందరగోళం నెలకొందన్నారు. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, కార్పోరేషన్లు, వ్యవసాయ శాఖ కార్యాలయాలకు సూచన చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు మేరకు పేర్లు మారుస్తూ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆమోదంతో వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -