ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ

17
- Advertisement -

పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మోడీ సర్కార్‌ పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటుండగా ఈ ఘటనపై ప్రధానికి లేఖ రాశారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ.

ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను ఏర్పాటు చేయాల‌ని కోరారు. టెర్రర్ అటాక్‌పై చ‌ర్చించేందుకు అత్య‌వ‌స‌రంగా పార్ల‌మెంట్ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని కోరారు. ఉగ్ర‌వాదాన్ని ఖండిస్తూ ఏక‌ప‌క్ష తీర్మానం చేద్దామ‌న్నారు.

ఐక‌మ‌త్యం, సంఘీభావం కావాల‌న్నారు. ఇలాంటి సమ‌యంలో ఉభ‌య‌స‌భ‌ల్లోనూ ప్ర‌త్యేక స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని ప్ర‌తిప‌క్షం భావిస్తున్న‌ద‌ని ఖ‌ర్గే తెలిపారు. పార్ల‌మెంట్ తీర్మానంతో ఐక‌మ‌త్యం చాటుదామ‌ని పేర్కొన్నారు. పెహ‌ల్గామ్ విషాదం ప్ర‌తి భార‌తీయుడిని క‌లిచివేసిందన్నారు రాహుల్ గాంధీ. ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా పోరాడుతామ‌ని ఇండియా త‌న శ‌క్తిని చాటాల‌ని రాహుల్ తెలిపారు.

Also Read:కశ్మీర్.. టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత

- Advertisement -