కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే..

131
kharge
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. 24 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు.

అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఎంపీ శశిథరూర్‌పై ఆయన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, శశిథరూర్‌కు వెయ్యి ఓట్లు వచ్చాయి. మరో 416 ఓట్లు అనర్హతకు గురయ్యాయి. ఈనెల 17న ఎన్నికలు జరగ్గా ఇవాళ ఓట్ల లెక్కింపు చేపట్టారు.

137 ఏండ్ల కాంగ్రెస్‌ పార్టీ సుదీర్ఘ చరిత్రలో అధ్యక్ష పదవికి ఆరుసార్లు మాత్రమే ఎన్నిక జరగడం విశేషం. 2000లో చివరిసారిగా సోనియా గాంధీ, జితేంద్ర ప్రసాద్ మధ్య ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుల్లో సోనియా 22సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పనిచేశారు. చివరిసారి గాంధీయేతర కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేస్రీ.

- Advertisement -