మోడీ దేశాన్ని అమ్మేయడం పక్కా:ఖర్గే

16
- Advertisement -

ఏదో రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అమ్మేయడం ఖాయమన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ నగరంలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో మాట్లాడిన ఖర్గే.. భారత ఆర్థిక ఆర్థికవ్యవస్థ లో ఇప్పుడు గుత్తాధిపత్యం రాజ్యమేలుతోందని, ప్రభుత్వ ఆస్తులన్నింటిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

దేశ ఆర్థిక వ్యవస్థలో గుత్తాధిపత్యం రాజ్యమేలుతోంది. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి అని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వానికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు. కానీ ప్రభుత్వ ఆస్తులను మాత్రం ఒక్కొక్కటిగా మిత్రులకు కట్టబెడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో అన్నింటా ప్రభుత్వ ఆధిపత్యమే కొనసాగుతున్నదని, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వ నియంత్రణలోనే ఉందని ఆరోపించారు. ఏదో ఒకరోజు ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వం ఈ దేశాన్ని అమ్మేస్తారు… నెహ్రూ నిర్మించిన ప్రభుత్వరంగ ఫ్యాక్టరీలు అన్నింటిని మోదీ అమ్ముతున్నారు అని మండిపడ్డారు.

Also Read:తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పిన కేసీఆర్

- Advertisement -