మొక్కలు నాటిన ఖమ్మం జెడ్పీ చైర్మన్ కమల్ రాజు..

283
Kamal Raj
- Advertisement -

గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆదివారం రోజు తన పుట్టినరోజు సందర్భంగా, ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయంలో తన సతీమణి వసంత రాణితో మొక్కలు నాటారు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారు, ఆ స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటి, వాటిని ఎదిగే బాధ్యత తీసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -