మొక్కలు నాటిన కోలీవుడ్ హీరోయిన్ దర్శ గుప్త..

147
Actress Dharsha Gupta

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు వారికి తోచిన విధంగా మొక్కలు నాటి ఇతరులను మొక్కలు నాటాలని పిలుపునివ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా తమిళ యువ హీరోయిన్ దర్శ గుప్తా చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అందరూ పాల్గొనాలని ఈ ఆదివారం అందరూ మొక్కలు నాటాలని నాటిన మొక్కలను తమ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకొని తనకు ట్యాగ్ చేయాలని అని పిలుపునిచ్చారు. ఈ విధంగా చేసిన వారిని త్వరలోనే ఒక ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వారందరితో సమావేశమవుతను అని మాటిచ్చారు. దీనికి స్పందించిన చాలా మంది మొక్కలు నాటి తన ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేయడం జరుగుతుంది.