మున్సిపల్ ఎన్నికలపై ఖమ్మం టీఆర్ఎస్ నేతల భేటీ…

296
khammam trs
- Advertisement -

మున్సిపల్ ఎన్నికలపై ఖమ్మం టీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంట్లో జరిగిన ఈ భేటీలో ఎంపీ నామా నాగేశ్వరరావు , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

మున్సిపల్ ఎన్నికల సన్నద్ధత పై సమాలోచనలు జరిపిన నేతలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5 కు 5 మున్సిపాలిటీలు గెలిచేలా పని చేయాలని ఈ సందర్భంగా అంతా అభిప్రాయపడ్డారు. 7 వ తేదీ నుంచి మునిసిపాలిటీల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన నేతలు…తొలుత మధిర, వైరా, సత్తుపల్లి లో టీఆర్ఎస్ శ్రేణుల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ బాలసాని, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, రాములు నాయక్, వనమా వెంకటేశ్వరరావు , జిలా పరిషత్ చైర్మన్ కమల్ రాజు హాజరయ్యారు.

- Advertisement -