- Advertisement -
కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం ఖైదీ. పక్కా మాస్ ఎంటర్ టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన ప్రతిచోటా పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. సినిమాలో కార్తీ నటనకు మంచి మార్కులు పడగా యావజ్జీవ శిక్ష పడిన ఖైదీగా అద్భుతంగా నటించాడు.
తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ఈ సినిమాకి మరో హైలైట్ కాగా…. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లను రాబడుతోంది.
ఈ నెల 25వ తేదీన ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా దూసుకుపోతోంది. ఇప్పటివరకు రూ. 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లు,తమిళనాడులో రూ.25 కోట్ల వసూళ్లను రాబట్టింది.కొత్తగా విడుదలైన సినిమాల పోటీని తట్టుకుని కూడా ఈ సినిమా రన్ అవుతుండటం విశేషం.
- Advertisement -