ఖైదీ కలెక్షన్ల సునామీ..

109
Khaidi

చిరంజీవి తాజా చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’ బుధవారం విడుదలైంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందు వచ్చిన ఖైదీ ఎక్స్‌పెక్టేషన్స్‌కు ఏ మాత్రం తక్కువ కాకుండా విజయవంతమైన చిత్రంగా దూసుకుపోతోంది. రీమేక్ స్టోరీ అయినప్పటికీ..అద్యంతం కొత్తగా ప్రెసెంట్ చేయడంతో..ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇక చిరంజీవి నటన ఆకట్టుకునేలా ఉండడం..  డాన్స్‌ , ఫైట్స్ ఇలా అన్నింటిలోను మునపటి గ్రేస్‌ ను గుర్తుకు తెచ్చాడు. దీంతో సినిమాకు పాజిటీవ్ టాక్ వస్తోంది. ఇటు సోషల్ మీడియాలో కూడా ఖైదీపై పాజిటీవ్  కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ‘ఖైదీ నంబర్‌ 150 సూపర్‌ హిట్ అమ్మా.. బాస్‌ ఈస్‌ బ్యాక్ ట్యాగ్ లైనుకు మెగాస్టార్ పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్, డాన్స్, టైమింగ్, ఎగ్జిక్యూషన్ సూపర్బ్‌. సినీ ప్రేక్షకులకు సంక్రాంతి మొదలయింద’ని ఇలా సినిమా చూసిన వాళ్లు ట్వీట్ చేస్తున్నారు.

Khaidi

భారీ అంచనాల మధ్య రిలీజైన ఖైదీకి ప్రీమియర్ షో నుంచి సూపర్ హిట్ టాక్ రావడంతో కలెక్షన్లలో దుమ్ములేపుతోంది. ఖైదీ హంగామా చూస్తుంటే ఓపెనింగ్ కలెక్షన్స్‌ లో బాహుబలి రికార్డును దాటడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమా మొదటి రోజు 25 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టే..అవకాశం ఉందట. దీన్ని బట్టి చూస్తే టాలీవుడ్ లో ఓపెనింగ్ కలెక్షన్స్‌ లో ఖైదీ సరికొత్త రికార్డు సృష్టించినట్టే. మొత్తానికి ఖైదీ 150 చిత్రం రూ.100 కోట్లు మించి వసూళ్లు సాధిస్తుందని అభిమానులు దీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..ఓవర్సిస్ కలెక్షన్స్ లో కూడా ఖైదీ దుమ్ము రేపుతోంది. అమెరికాలో ప్రీమియర్‌ షోలు పూర్తి కాకుండానే మిలియన్ డాలర్లు వసూళ్లు చేసిందట.

Khaidi