డిసెంబర్‌ 25న ఖైదీ ఆడియో….!

93

మెగా స్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత ఖైదీ నెం150వ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో వెండితెరపై మళ్లీ చిరంజీవి చూస్తున్నమని మెగా అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. ఇప్పటికే ఖైదీనెం150వ చిత్రం షూటింగ్‌ కూడా పూర్తి చేసుకుందట. ఖైదీ నంబర్ 150ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు సినీ అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఆడియో ఈవెంట్ను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. మెగా ఫ్యామిలీ హీరోలందరూ పాల్గొనేఈ ఈవెంట్కు ముహుర్తం వేదిక ఫిక్స్ అయినట్టుగా ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ శుక్రవారం రోజున చరణ్‌ ధృవ సినిమా రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో ఈసినిమాతో పాటు ఖైదీ నెంబర్ 150 ట్రైలర్‌ను థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత డిసెంబర్‌25న సినిమా ఆడియో వేడుకను మెగా అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Khaidi No.150 Movie Audio launch December 25

అయితే ఈ వేడుకలను విజయవాడలోని ఇందిర గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్నట్లు సమాచారం. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమాకూర్చుతున్నాడు. రామ్‌ చరణ్‌ తొలిసారి నిర్మాతగా ఈ చిత్రన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మాస్‌ స్పెషలిస్ట్‌ వివి వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

Khaidi No.150 Movie Audio launch December 25

ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు రాంచరణ్ కనిపించనున్నారు. అంతేకాదు చిరుతో కలిసి ఓ పాటలో చెర్రీ స్టెప్పు వేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాంచరణ్ వెల్లడించారు. ‘‘నాన్నగారి సినిమాలో నేనూ కనిపిస్తా. ఓ పాటలో ఆయనతో కలసి స్టెప్పులు వేశా. నాన్నగారి ప్రతిష్ఠాత్మక చిత్రానికి నేను నిర్మాతగా వ్యవహరించడం ఆనందంగా ఉంది. వినాయక్‌ లాంటి అనుభవజ్ఞుడైన దర్శకుడు ఉన్నందున ఆ సినిమా విషయంలో పెద్దగా కలగజేసుకొనే అవసరం ఉండడం లేదు. క్రిస్మస్‌కి ఈ చిత్రంలోని పాటల్ని విడుదల చేస్తాం. ఆడియో వేడుక ఎక్కడ నిర్వహించాలన్న విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. జనవరి 11 లేదా 12న సినిమాని విడుదల చేసే అవకాశం ఉంద’’న్నారు.