చూడండిరా అబ్బాయిలు..

216
Chiru
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 తో యంగ్ హీరోలకు కొత్త పాఠం నేర్పాడు. చూడండిరా అబ్బాయిలు అంటూ కలెక్షన్ల విషయంలో కొత్త దారి చూపాడు. ఇంతకు చిరు నేర్పిన ఆ పాఠాలు ఏంటీ అనుకుంటున్నారా. టాలీవుడ్‌కు 100 కోట్ల క్లబ్ అనేది పాత విషయమే అయినా..మెగాస్టార్ అందులో కూడా కొత్త రికార్డు సృష్టించి యంగ్ హీరోలను ఆశ్చర్యానికి గురిచేశాడు. సౌత్లో వందకోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాలు ఉన్నా, అవన్ని రెండు, మూడు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయి ఆ రికార్డ్ను సాధించాయి.. కానీ కేవలం ఒక్క భాషలోనే రిలీజ్ అయి వందకోట్ల క్లబ్లో చేరిన సినిమాలు మాత్రం చాలా అరుదు అలాంటి అరుదైన రికార్డ్ను తన ఖాతాలో వేసుకున్నాడు మెగాస్టార్.

Chiru

భారీ అంచనాల మధ్య సంక్రాంతి బరిలో నిలిచిన ఖైదీ నెం.150 హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బాలయ్య లాంటి స్టార్ హీరో పోటీకి దిగినా..కేవలం వారం రోజుల్లో 100 కోట్లను క్రాస్ చేసి ది బాస్ ఈజ్ అనిపించుకున్నాడు చిరు. తొమ్మిది సంవత్సరాల పాటు సినిమాకు దూరంగా ఉన్నా..రీ ఎంట్రీతో ప్రేక్షకులను మెప్పించి కలెక్షన్లు కొల్లగొట్టాడు. మొత్తానికి ఒక్క భాషలో రిలీజ్ అయి వందకోట్ల క్లబ్లో చేరిన సినిమాగా చిరు ఖైదీ నెంబర్ 150 రికార్డు సృష్టించింది. ఇప్పటికీ సినిమాకు కలెక్షన్ల పారుతూనే ఉంది.

- Advertisement -