కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా ‘కేజీఎఫ్‌’ డైరెక్ట‌ర్..

35
KGF Director

దేశంలో క‌రోనా ఉధృతి నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రు బాధ్యతగా వ్యాక్సిన్‌ వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో సామాన్యులు, సెల‌బ్రిటీలు వ్యాక్సిన్ తీసుకుంటు అందరకీ అగాహన కల్పిస్తున్నారు. తాజాగా కేజీఎఫ్ డైరెక్ట‌ర్‌గా ప్ర‌శాంత్ నీల్ కరోనా తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపాడు ప్ర‌శాంత్ నీల్. ‘‘నేను వ్యాక్సిన్‌ తీసుకున్నా. మీరు స్లాట్‌ బుక్‌ చేసుకుని మీ కుటుంబ సభ్యులతో వ్యాక్సిన్‌ తీసుకోండి’’ అని రాశారు.

‘కేజీఎఫ్‌’ చిత్రంతో ప్యాన్‌ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్‌ నీల్‌. ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’ పూర్తి చేసిన ఆయనతో స్టార్‌ హీరోలు సైతం సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్‌తో ‘సలార్‌’ చేస్తున్నారు. ఎన్టీఆర్‌తో ఓ సినిమాకు సైన్‌ చేశారు.