KGF2 తొలిరోజు వసూళ్లు ఎంతో తెలుసా?

57
kgf 2
- Advertisement -

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్‌ 2. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకుంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నెట్ వసూళ్ల ప్రకారం చూస్తే ఇది దాదాపు రూ.130 కోట్లు.

సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్‌లో మరిన్ని వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తొలిరోజున రూ.223 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకుంది. ఆ లెక్కలో రూ.73 కోట్ల రూపాయలు వసూళ్లు ట్రిపుల్ ఆర్‌కి ఎక్కువగా వచ్చాయి.

యష్ నటన,ప్రశాంత్ నీల్ దర్శకత్వం సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారాయి.

- Advertisement -