కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్-2’. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది ఈ సినిమా. కాగా మొదటి రోజు 85 కోట్ల రేంజ్‌లో షేర్ అందుకోగా.. 164 కోట్లకు పైగా గ్రాస్ వసూలు అయ్యింది. దీంతో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు 520 కోట్ల వరకు గ్రాస్‌ను వసూలు చేయాల్సి ఉంటుంది.
తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 19.09 కోట్ల షేర్‌ని సాధించింది. ఇక వరల్డ్ వైడ్‌గా 164 కోట్ల వసూలు రాబట్టింది. ఈ సినిమా టోటల్‌గా ప్రపంచవ్యాప్తంగా 345 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేయగా.. బ్రేక్ ఈవెన్ కోసం దాదాపుగా 680 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ను రాబట్టాలి అంటున్నారు. ఈ సినిమా హిందీలో రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ‘తొలిరోజు వసూళ్లలో ‘కేజీఎఫ్-2’ చరిత్ర సృష్టించింది. ‘వార్’, ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమాలు మొదటి రోజు వసూళ్లలో సృష్టించిన రికార్డులను కేజీఎఫ్ బద్దలు కొట్టింది. హిందీలో ఇప్పుడు ‘కేజీఎఫ్-2’ తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ‘కేజీఎఫ్-2’ తొలిరోజు రూ.53.95 కోట్లు రాబట్టగా, అంతకు ముందు ‘వార్’ సినిమా తొలి రోజు రూ.51.60 కోట్లు, ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ రూ.50.75 కోట్లు రాబట్టింది.