కేజీఎఫ్‌ 2…మరో అప్‌డేట్

43
kgf 2

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం కేజీఎఫ్‌ . 2018లో బాక్సాఫీస్‌ ముందు వచ్చిన ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టించగా తాజాగా దీనికి సీక్వెల్‌గా కేజీఎఫ్‌ 2 వస్తోంది.

వరుసగా అప్‌డేట్‌ ఇస్తున్న చిత్రయూనిట్ తాజాగా ఇనాయత్​ ఖలీల్​ క్యారెక్టర్​ను పోషిస్తున్న బాలకృష్ణ పోస్టర్​ను పేప‌ర్ క‌ట్టింగ్ రూపంలో విడుద‌ల చేశారు. గుర్తుతెలియని ప్రాంతంలో ఇనాయత్​ ఖలీల్​ తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడంటూ చిత్ర బృందం పేర్కొంది.

బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్, రవీనా టాండన్‌ కీలక పాత్ర పోషిస్తుండగా ఈ పాన్ ఇండియా చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్‌ 2 విడుదల కానుంది.