ఆనందయ్య మందు…రిటైర్డ్ హెడ్‌మాస్టర్ మృతి

52
headmaster

నెల్లూరు ఆనందయ్య మందు..హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందుపై విపరీతంగా ప్రచారం జరుగుతుండగా ప్రభుత్వం బ్రేక్ వేసింది. దీనిపై పరిశోధనలు జరుగుతుండగా ఇప్పుడిప్పుడే ఆనందయ్య మందు వికటించి మృతిచెందిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.

ఆనంద‌య్య త‌యారు చేసిన మందుతో క‌రోనా త‌గ్గింద‌ని ప్ర‌క‌టించిన రిటైర్డ్ హెడ్‌మాస్ట‌ర్ కోట‌య్య మృతిచెందారు. క‌రోనా సోకడంతో ప‌ది రోజుల క్రితం నెల్లూరులోని జీజీహెచ్‌లో చేరారు. నాలుగు రోజులుగా వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతూ సోమ‌వారం ఉద‌యం చ‌నిపోయారు.

త‌న‌కు క‌రోనా సోకిన త‌ర్వాత ఆనంద‌య్య ఔష‌ధాన్ని తీసుకున్నారు. అనంత‌రం కోలుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో ఆనంద‌య్య ఔష‌ధం వెలుగులోకి వ‌చ్చింది.