విరాట్ ప్రాక్టీస్‌పై కెవిన్ పీటర్సన్‌ చురకలు!

266
kohli
- Advertisement -

మరో 15 రోజుల్లో ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్నిజట్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. ఇక ప్రాక్టీస్ సెషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సెటైర్లు వేశారు పీటర్సన్.

దాదాపు 5 నెలల తర్వాత గ్రౌండ్ లోకి వచ్చిన కోహ్లీ తన ప్రాక్టీస్ లో ఎక్కువగా బంతులను డిఫెండ్ చేసేందుకే ఆసక్తి కనబర్చాడు. దీంతో విరాట్ డిఫెండింగ్‌పై మండిపడ్డాడు పీటర్సన్. కోహ్లీ ఇది టెస్ట్ కాదు టీ 20… బంతిని హిట్ చేయ్ అని కామెంట్ చేశాడు.

ఇక ఇప్పటివరకు ఐపీఎల్ లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ అందుకొని జట్లలో ఆర్సీబీ ఒకటి. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 జరగనుంది.

- Advertisement -