ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : కేశవ అన్వేష్‌

22
kesava
- Advertisement -

రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటిస్తున్న ప్రముఖుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ గండ్ర కేశవ అన్వేష్ జన్మదిన సందర్భంగా…. ప్రకాశం రోడ్డులో గల హనుమాన్ దేవాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే ఆవకాశం కలిగినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు క్యాతం సృజన్, చిత్తారి ఆనంద్, బొలిశెట్టి రంజిత్, సాయి, చందు నేత, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -