- Advertisement -
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్పుకు ఆమోదం తెలిపింది.“Kerala (Alteration of Name) Bill, 2026”ను రాష్ట్రపతి కేరళ శాసనసభకు అభిప్రాయాల కోసం పంపనున్నారు.
శాసనసభ అభిప్రాయాల అనంతరం బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు.24 జూన్ 2024న కేరళ శాసనసభ ఏకగ్రీవంగా “Kerala” పేరును “Keralam”గా మార్చాలని తీర్మానం చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల పేర్ల మార్పు అధికారం పార్లమెంట్‌కు ఉంది.రాష్ట్రపతి సిఫారసు తప్పనిసరి.కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను పరిశీలించి, న్యాయ మంత్రిత్వ శాఖ సమ్మతి తెలిపింది.
ALso Read:The Kerala Story 2:సీబీఎఫ్‌సీని ప్రశ్నించిన కేరళ హైకోర్టు
- Advertisement -

