కేరళ..డోన్ట్‌ వర్రీ : రెహమాన్ సాంగ్‌

257
- Advertisement -

కెరళ..డోన్ట్‌ వర్రీ… అంటున్నాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏ.ఆర్‌. రెహమాన్‌. ఓవైపు అతలాకుతలమైన రాష్ట్రాన్ని చూసి డోన్ట్‌ వర్రి అంటున్నాడేంటి..? అనుకుంటున్నారా..అదంతే.. నిజానికి అదే ఆయన స్టైల్‌. ఎంత బాధలో ఉన్నా..తన సాంగ్‌తో మరో లోకానికి తీసుకెళ్తాడు ఈ స్టార్‌.

తాజాగా కెరళ కోసం ఓ పాటని అంకితం చేశాడు రెహమాన్. ‘ప్రేమదేశం’ చిత్రంలోని ‘ముస్తఫా ముస్తఫా’ పాటను పేరడీగా చేసి ‘కేరళ..కేరళ..డోన్ట్‌ వర్రీ కేరళ’ అంటూ పాటను ఆలపించారు. ఇటీవల లాస్‌ఏంజెల్స్‌లో కచేరీలో పాల్గొన్న రెహమాన్‌..కేరళ వాసులకు ధైర్యం చెబుతూ ఈ పాటను వారికి అంకితం చేశారు. ఇంకేముందీ…రెమమాన్‌ నోట వచ్చిన ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తోంది. కాగా..ప్రస్తుతం అమెరికాలో కచేరీలతో బిజీగా ఉన్నాడు ఏ ఆర్‌ రెహమాన్.

- Advertisement -