ఇప్పుడు కెరళకు కావాల్సింది అన్నవస్ర్తాలు కావు: జోసెఫ్‌

305
- Advertisement -

భారీ వర్షాలు, వరదల వల్ల కెరళ రాష్ట్రం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రానికి ఇప్పుడు కావాల్సింది తిండి, బట్టలు కాదని చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి ఆల్ఫన్‌ జోసెఫ్‌. అయితే కేరళకు కావాల్సింది ఈ సాయం కాదని ఆ రాష్ర్టానికి చెందిన ఆల్ఫాన్స్ అన్నారు.

Alphons.

కేరళకు కావాల్సినవి అన్నవస్ర్తాలు కావు అని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం సుమారు 680 కోట్ల సాయం ప్రకటించినందున నగదు కూడా సమస్య కాదని అన్నారు. ఆహారపదార్థాలు, దుస్తులను జిల్లా కలెక్టర్లు సమకూరుస్తున్నారని ఆయన చెప్పారు. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత జరిగే పునర్నిర్మాణంలో సాంకేతిక సహాయం చాలా అవసరమని, దానిని దాతలు సమకూరిస్తే బాగుంటుందని అల్ఫాన్స్ సూచించారు.

అలాగే సాంకేతిక నైపుణ్యం కలిగినవారు కేరళకు వచ్చి అండదండలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఓణం పండుగ కోసం వ్యాపారులు ఆహార పదార్థాలు, ఇతర సరుకులు దండిగా నిల్వచేసినందున ఆహారానికి కొరత లేదని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఆహార పదార్థాల రవాణాయే అసలు సమస్యని చెప్పారు. ఈ విషయంలో కేంద్రం, ప్రజలు ఎంతో సహకరించారని విజయన్ అన్నారు.

KERALA

ఇదిలా ఉండగా…కెరళ పోటెత్తిన వరదల వల్ల 300 మందికి పైగా బలయ్యారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దాంతో ఏదో రకంగా సాయం అందించాలని మానవత్వం ఉన్నవారందరూ తపన పడుతున్నారు. నాలుగువైపుల నుంచి విరాళాలు వస్తూనే ఉన్నాయి.

కెరళ రాష్ట్రానికి విరాళాలు ఇవ్వదలచుకున్నవారు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా పంపగలరు…

https://donation.cmdrf.kerala.gov.in/#

 

- Advertisement -