వరదల్లోనే పెళ్లి – ఆశీర్వదించిన బాధితులు

301
kerala marraige
- Advertisement -

ప్రకృతి ప్రకోపానికి కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు కేరళ జల ప్రళయంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఎటు చూసిన సాయం కోసం అభాగ్యులు ఎదురుచూస్తూనే కనిపిస్తున్నారు. వరదల దాటికి సర్వం కోల్పోయి సాయం కోసం దీనంగా చూస్తున్నారు. కేరళలోని వరద సహాయం శిబిరంలో ఓవైపు ఆర్తనాదాలు వినిపిస్తుండగా మరోవైపు బ్యాండ్‌ బాజాలు కూడా మోగాయి. ఎలాంటి హంగు ఆర్బాటం, విందు వినోదాలు లేకుండా దైవ సాక్షిగా వధువరులిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

kerala marraige

వరదల ధాటికి ఇండ్లు కూలి సర్వం కోల్పోయి దిక్కుతోచక ఉన్న ఆ కుటుంబాలకు ఈ పెళ్లి కొంత స్వాంతన చేకూర్చింది. కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలోని ఓ వరద సహాయ శిబిరంలో ఈ పెళ్లి ఉన్నంతలో ఘనంగా జరిగింది. అంజు అనే యువతి తన కుటుంబంతో వరద సహాయ శిబిరంలో ఉంటోంది. అయితే వరదలకు ముందు ఆమె వివాహం నిశ్చయమైంది. అయితే ప్రకృతి కన్నెరచేయడంతో కేరళలో భారీ వర్షాలు కురవడంతో జలవిలయం సంభవించడంతో అంతా అస్తవ్యస్తమైంది. దీంతో ఆ యువతి కుటుంబం పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతోంది.

అయితే ఆ యువతి పెళ్లి సమయం దగ్గర పడుతుండడంతో వరదలు ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో సహాయక శిబిరంలోని ఇరుగుపొరుగువారు ఆమె వివాహాన్ని జరిపించాలని నిర్ణయించుకున్నారు. వరుడి కుటుంబాన్ని ఒప్పించారు. ఇందుకు వరుడు సరే అనడంతో వీరి పెళ్లి సహాయక శిబిరంలోనే ఘనంగా జరిగింది.

- Advertisement -