కేంద్రం…పురుగు మందులపై నిషేధం

51
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం పురుగు మందుల వినియోగంపై పలు ఆంక్షలు విధించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ముసాయిదాలో రైతులు తరచూ వాడే కార్బోఫ్యూరాన్ మలాథియాస్ మోనోక్రోటోఫాస్ క్వినాల్ ఫాస్ మాంకోజెబ్ ఆక్సిఫ్లోరోఫిస్ డైమిథేట్ క్లోరిఫైరిపాస్‌లను మందుల గురించి పేర్కొంది. ఈ మేరకు లెబుల్ లీఫ్లేట్‌లలో తాము నిర్దేశించిన పంటలను తొలగించాలని ప్రతిపాదించింది. పంటల యొక్క జీవ సామర్థ్యం అవశేషాల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

కార్బఫ్యూరాన్ కార్బోఫ్యూరాన్ 3%పూతతో కూడిన గుళికలు మినహా మిగతా అన్నిరకాల ఫార్ములేషన్ల వినియోగాన్ని ఆపేయాలి. క్రాప్ లేబుల్స్‌ను నిలిపేయాలి.

మలాథియాన్ జొన్నలు, సెనగ, సోయాబిన్, ఆముదం, పొద్దుతిరుగుడు, బెండ, వంగ, కాలీఫ్లవర్, ముల్లంగి, టొమాటో, యాపిల్, మామిడి, ద్రాక్ష పంటలకు వాడకూడదని పేర్కొంది.

మోనోక్రోటోఫాస్ నీటిలో కరిగిపోయే 15%గుళికలు మినహా ఈ పురుగుమందుకు సంబంధించిన మిగతా అన్ని ఫార్ములేషన్ల వినియోగాన్ని నిషేధించింది.

క్వినాల్‌ఫాస్ జనపనార, యాలకులు, జొన్నలు

మాంకోజెబ్‌ జామ, జొన్న, కర్రపెండలం పంటలు

డైమెథేట్ ముడి ఆహారంగా తీసుకొనే పండ్లు కూరగాయాలకు దీన్ని ఉపయోగించడకూడదు.

ఆక్సీఫ్లోర్‌పిన్ ఆలూ, వేరుశనగ

క్లోరిఫైరిఫాస్ రేగు, సిట్రస్, పొగాకు పంటలకు ఉపయోగించరాదని కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదాలో పేర్కొంది.

సెంట్రల్ ఇన్‌సెక్టిసైడ్ బోర్డు అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ సెక్రటరీకి ఆరునెలల్లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. డైకోఫోల్ డైనోక్యాప్ మిథోమిల్ పురుగుమందులను దేశంలో నిషేధించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. ఈ ముసాయిదా నోటిఫికేషన్‌లోని అంశాలపై అభ్యంతరాలు సూచనలు సలహాలు ఉంటే 30రోజులోపు jspp-dac@gov.inఅన్న మెయిల్‌కు పంపొచ్చని తెలిపింది.

ఇవి కూడా చదవండి…

కొండగట్టు అటవీకి రెండంచల అభివృద్ధి..

వైద్యశాఖలో 1400అసిస్టెంట్ ప్రొఫెసర్..

ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి

- Advertisement -