‘కెలికేసే కాలమే – బీ కేర్‌ ఫుల్‌’..

188
Kelikese kalame press meet
- Advertisement -

వైష్ణో మీడియా సమర్పణలో ఓం శ్రీ క్రియేషన్స్‌ పతాకం పైన పూజిత విషం శెట్టి నిర్మించగా నాగ శ్రీనివ్యాస్‌ దర్శకత్వం వహించిన కెలికేసే కాలమే – Be Careful లఘు చిత్రాన్ని ఫిలిం చాంబర్‌లో 4-4-17 మంగళవారం ప్రదర్శించడం జరిగింది… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకులు, నటులు శ్రీ కాశీ విశ్వనాథ్‌ గారు, కమెడియన్‌ భధ్రం విచ్చేసారు… ఈ కార్యక్రమంలో నటులు కోటేష్‌ మానవ గారు మాట్లాడుతూ ఈ ఫిలిం ఢిల్లీలో, బెంగుళూరులో స్ట్రీల పైన జరిగిన అమానుష సంఘటనల్ని గుర్తుకు తెస్తుందని, పరిమితమైన వనరులతో ఈ ఫిలిం ద్వారా మంచి మెసేజ్‌ దర్శకులు ఇచ్చారని అన్నారు.

కాశీ విశ్వనాధ్‌ గారు మాట్లాడుతూ ఈ చిత్రం ప్రస్తుతం ఉన్న సమాజ పరిస్థితుల్ని అద్దంలా కళ్ళకి కట్టినట్లు చూపించిందని, స్వేచ్చను దుర్వినియోగం చెయ్యకూడదనే సందేశం చాలా బాగుందని చెప్పారు… డైలాగ్స్‌ బాగున్నాయని, దర్శకత్వ ప్రతిభ చూపించిన నాగ శ్రీనివ్యాస్‌ గోదావరి జిల్లాలో మా పక్క ఊరు రాజమండ్రి దగ్గర మిర్తిపాడుకి చెందినవాడు కావడం సంతోషంగా ఉందని, దర్శకుడికి ఉజ్వల భవిష్యత్‌ ఉంది… నాగ శ్రీనివ్యాస్‌ మొక్కకి పూరిజగన్నాధ్‌ అనే కంచె ఉండటం వల్ల తను పెద్ద వృక్షంగా ఎదుగుతాడని దీవించారు.
  Kelikese kalame press meet
ప్రముఖ కమెడియన్‌ భధ్రం మాట్లాడుతూ మా అడ్డా అయిన పూరి కేవ్‌లో దర్శకుడు నాగ శ్రీనివ్యాస్‌తో తనకి సన్మిహిత సంబంధం ఏర్పడిందని, కొంతమంది కథ చెప్తున్నప్పుడే వారి శక్తి తెలుస్తుంది… కాని తనతో మాట్లాడుతున్నప్పుడే తనకున్న రచనా శక్తి సృజనాత్మకత కళ్ళ ముందు కనపడుతుందని, కెలికేసే కాలమే అనే విభిన్నమైన టైటిల్‌తోనే తన శైలిని చాటుకున్నాడని, భవిష్యత్‌లో పెద్ద దర్శకుడిగా ఎదుగుతాడని ప్రశంసించారు…
మ్యూజిక్‌ డైరెక్టర్‌ సుభాష్‌ ఆనంద్‌ మాట్లాడుతూ కలికాలంలో మనుషులు పెరిగిన నాగరికత అనాగరికం వైపు ఎలా తీసుకెళ్తుంది… స్వేచ్చ పేరుతో మన సంస్కృతి ఎలా పెడదారి పడుతుంది అనే అంశాన్ని చాలా చక్కగా చూపించారని అన్నారు.

దర్శకుడు నాగ శ్రీనివ్యాస్‌ మాట్లాడుతూ తను పుట్టింది, పెరిగింది రాజమండ్రి. చదివింది భీమవరం అయితే, ఇప్పుడు బ్రతుకుతున్నది మాత్రం పూరి గారి మీద పడి అని, తను పూరి గారి భక్తుడినని ఎందుకంటే ఒక గురువుకి శిష్యుడిని మించిన భక్తుడు ఎవ్వరూ ఉండరని, అలాగే ఒక శిష్యుడికి గురువుకి మించిన గొప్పది ఏదీ ఈ ప్రపంచంలో లేదని అన్నారు… తను డైరెక్షన్‌ అనే చాలా మౌంటైన్స్‌ దగ్గరకి చాలా సులువుగా వెళ్ళానని కాని అవి ఎక్కడం చాలా కష్టమనిపించిందని, కాని పూరి అనే ఎవరెస్ట్‌ మౌంటైన్‌ చేరుకోవడానికి తనకి ఆరేళ్ళు పట్టిందని, కాని అది ఎక్కడం చాలా సులువు అనిపించిందని డైరెక్షన్‌ అంటే ఇంత సులువా అనే కాన్ఫిడెన్స్‌ గురువు గారిచ్చారని, ఇదంతా ఆయన పెట్టిన భిక్ష అన్నారు.
   Kelikese kalame press meet
కలికాలాన్ని ఇప్పుడున్న యువత ముద్దుగా కెలికేసే కాలంగా పిలుచుకుంటూ హద్దులు దాటుతుందని, ఈ ఫిలిం యూ ట్యూబ్‌ వ్యూస్‌ కోసం చెయ్యలేదని, తనని తాను పరిక్షించుకోవడం కోసం, ఒక మంచి సందేశం జనాలకి చేరువ కావడం కోసం చేసానని అన్నారు… తనకి మీడియా మిత్రుల శ్రేయోభిలాశులని తను సినీ పరిశ్రమ గురించి ఆకళింపు చేసుకోవడానికి, ఈ పొజీషన్‌లో ఉండటానికి మీడియానే కారణమని, ఏం చేసినా మీడియా ఋణం తీర్చుకోలేనని అన్నారు.

ఇప్పుడున్న కెలికేసే కాలంలో తల్లితండ్రులు అతిగారాబం పేరుతో పిల్లల్ని పెంచుతూ వారికి తెలియకుండానే పిల్లలు ప్రక్క దారి పట్టడానికి బీజం వేస్తున్నారు… భరతమాత సంతతి అయిన మనం మంచికయినా చెడుకయినా కుటుంబమే పునాది అనే విషయాన్ని గ్రహించి భారత దేశ అభివృద్ధికి సహకరించాలని మనవి చేస్తూ సమాజం చెడు పోవడానికి ముఖ్యంగా తల్లితండ్రులు ఎలా కారణమవుతున్నారనే కోణాన్ని ఆవిష్కరించడానికి చేసిన చిన్న ప్రయత్నమే ఈ ”కెలికేసే కాలమే – Be Careful అనే ఈ చిత్రాన్ని చూసి దీవెనలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంకా మా అసోసియేషన్‌ ఇ.సి. మెంబర్‌ గోవింద్‌ కొప్పి శెట్టి , కో-డైరెక్టర్‌ హరీంద్రనాధ్‌, నటులు సాయి సతీష్‌, వీరేంద్ర, వెంకట్‌ రాజ్‌, పద్మావతి, దివ్య పాల్గొన్నారు.

- Advertisement -