బాహుబలి2 టిక్కెట్లు కావాలంటే….

156
Baahubali: The Beginning to have the widest re-release
Baahubali: The Beginning to have the widest re-release

ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండవ భాగం బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ విజువల్‌ వండర్‌ ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టిక్కెట్లు ఎప్పుడెప్పుడు దొరుకుతాయా.. అంటూ భాషలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా బాహుబలి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే బాహుబలి : ది కన్‌క్లూజన్‌ టిక్కెట్లు తొందరగా దొరకాలంటే మాత్రం ‘బాహుబలి: ది బిగినింగ్‌ సినిమాని మరోసారి చూడాలని నిర్మాతలు కండీషన్లు పెట్టారు. అయితే అది ఐదు రాష్ట్రాలకు వర్తించదు. ఈ ఆఫర్ కేవలం ఉత్తరాది ప్రేక్షకులకు మాత్రమే.

ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టి విజయ ఢంకా మోగించిన చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్‌’ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్‌ 7 నుంచి 17వరకూ ‘బాహుబలి 1’ థియేటర్లలో సందడి చేయనుంది. హిందీ వెర్షన్‌ను ధర్మా ప్రొడక్షన్స్‌ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. తొలిభాగం టికెట్లు కొనుగోలు చేసిన వారికి రెండో భాగం టికెట్‌పై హామీ ఇచ్చారు. అదీ హిందీ వెర్షన్‌కు మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ ఆఫర్‌ వర్తించదు. మిగిలిన అన్ని షరతులూ వర్తిస్తాయని ధర్మా ప్రొడక్షన్స్‌ పేర్కొంది.హిందీ వెర్షన్‌ ‘బాహుబలి: ది బిగినింగ్‌’ను రేపు దేశవ్యాప్తంగా 900 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. మొత్తంగా 1000 థీయోటర్లలో బాహుబలి:ది బిగినింగ్ ను విడుదల చేయాలని రాజమౌళీ టీం భావిస్తోంది.

Baahubali: The Beginning to have the widest re-release

మరోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల్లోనూ థియేటర్ల సంఖ్య మరింత పెరిగేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్ర‌స్తుతం తెలుగులో హిట్‌గా దూసుకుపోతున్న సినిమా ఏదీ లేక‌పోవ‌డం బాహుబ‌లికి క‌లిసి వ‌చ్చే అంశంగా మారింది. అలా మళ్లీ ‘బాహుబలి: ది బిగినింగ్‌’ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కావడం విశేషం. రెండో భాగం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ఏప్రిల్‌ 28న రాబోతోన్న తరుణంలో తొలి భాగాన్ని విడుదల చేయడం చక్కటి వ్యూహం. ఇది సరిగా పనిచేస్తే.. విజయం సాధించిన ఇతర చిత్రాలకూ ఆహ్వానం పలకవచ్చు.