Kejriwal:జైలు నుండే పాలన

34
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు నుండే పాలన మొదలుపెట్టారు సీఎం కేజ్జీవాల్. అరెస్టయిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జల మంత్రిత్వ శాఖకు నోట్‌ ద్వారా ఆదేశించారని పార్టీ వర్గాలు వెల్లడించారు.

లిక్కర్‌ పాలసీ కేసులో ఈ నెల 21న కేజ్రీవాల్‌ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆరు రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించగా ఈ స్కాంలో కేజ్రీవాలే కింగ్ పిన్ అని ఈడీ ఆరోపిస్తోంది. అయితే ఆప్ వర్గాలు మాత్రం కేజ్రీ అరెస్ట్‌ను ఖండిస్తున్నాయి. జైలు నుంచి పాలన సాగించడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని…కేజ్రీవాల్ దోషిగా నిర్ధారణ కాలేదని చెబుతున్నారు ఆప్ నేతలు.

Also Read:‘భరతనాట్యం’..విజయం సాధిస్తుంది

- Advertisement -