Kejriwal:జూ2న సరెండర్ అవుతా

9
- Advertisement -

జూన్ 2న తాను తిరిగి జైలుకు వెళ్లనున్నట్లు తెలిపారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసిన కేజ్రీవాల్…మ‌ళ్లీ తీహార్ జైలుకు వెళ్ల‌నున్న‌ట్లు చెప్పారు. మ‌ళ్లీ జైలుకు వెళ్తే త‌న‌ను ఎన్ని రోజులు బంధిస్తారో తెలియ‌ద‌న్నారు. జైలులో ఉన్నప్పుడు త‌న‌ను ఎన్నో విధాలుగా వేధించిన‌ట్లు ఆరోపించారు. త‌మ స‌ర్కారు అమ‌లు చేస్తున్న అన్ని స్కీమ్‌లు య‌ధాత‌థంగా ఉంటాయ‌ని, మ‌ళ్లీ వ‌చ్చిన తర్వాత ప్ర‌తి మ‌హిళ‌కు వెయ్యి ఇస్తానన్నారు.
త‌న‌కు మెడిసిన్ ఇవ్వ‌డం ఆపేశార‌న్నారు. బెయిల్‌ను పొడిగించాల‌ని కేజ్రీ పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ స్వీక‌రించ‌లేదు. దీంతో కేజ్రీవాల్ జైలుకు వెళ్లక తప్పనిసరి పరిస్థితి.

లిక్క‌ర్ స్కామ్‌తో లింకున్న మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేయగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయనకు 21 రోజుల తాత్కాలిక బెయిల్‌ మంజూరు కాగా జూన్ 1తో ఆ గడువు ముగియనుంది. సుప్రీం జారీ చేసింది. ఆ బెయిల్ గ‌డువు జూన్ ఒక‌టో తేదీతో ముగియ‌నున్న‌ది.

Also Read:KTR:రేవంత్ చెప్పిన బలిదేవత ఎవరు?

- Advertisement -