లిక్కర్ స్కామ్ లో భాగంగా ఇటీవల జైలుపాలు అయిన డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరిన్ని కష్టాలు తప్పెలా లేవు. సరిగ్గా ఎన్నికల ముందు జైలుకు వెళ్ళడంతో ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవడంతో పాటు పార్టీ కూడా బలహీన పడుతోంది. దర్యాప్తు సంస్థల ద్వారా మోడీ సర్కార్ అక్రమ అరెస్టులు చేయిస్తోందని కేజ్రీవాల్ అండ్ కొ చెబుతున్నప్పటికి ప్రజల్లో మాత్రం సానుభూతి ఏర్పడడం లేదు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో పక్కా ఆధారాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది. ఇక ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ తనను అక్రమంగా అరెస్టు చేశారని కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే ఎన్నికల సమయానికి ఆయన బయటకు వస్తారా ? లేదా అనేది అసలు ప్రశ్న. .
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.ఎందుకంటే ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఈడీ సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది. జూన్ లోగా ఆయన పేరును చార్జ్ షీట్ లో చేర్చేందుకు ఈడీ అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే కేజ్రీవాల్ కు మరిన్ని తిప్పలు తప్పవు. దేశ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా అమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతున్న క్రమంలో కేజ్రీవాల్ ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కోవడం పార్టీని పతనం చేసే అంశమే. ఒకవేళ కేజ్రీవాల్ ఏదో ఒక సందర్భంలో బయటకు వచ్చినప్పటికి లిక్కర్ స్కామ్ ఆప్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఢిల్లీతో పాటు పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఆప్ బలంగా విస్తరిస్తోంది. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టుతో ఆల్రెడీ బలం పొందిన రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ బలహీన పడే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి బీజేపీ వ్యూహంలో కేజ్రీవాల్ కు మరిన్ని కష్టాలు తప్పెలా లేవు.
Also Read:Revanth:రేవంత్ కు ‘భయం’ పట్టుకుందా?