ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌ని మరో 7 రోజులు పొడగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సీఎం కేజ్రీవాల్. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా లిక్కర్ స్కాం కేసులో తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో 7 రోజులు పొడిగించాలని.. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పిటిషన్ దాఖలు చేశారు.
కీటోన్ స్థాయిలు పెరిగాయని.. అందుకే తాను పీఈటీ-సీటీ స్కాన్ సహా పలు పరీక్షలు చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా తన మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలని తెలిపారు.
మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. దాదాపు 50 రోజులపాటు జైల్లో ఉన్న ఆయనకు లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు.
Also Read:కేన్స్ ఫెస్టివల్..ఉత్తమ నటిగా అనసూయాసేన్