గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌..అప్‌డేట్

3
- Advertisement -

ఖమ్మం – నల్లగొండ – వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున పట్టభద్రులు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం అధికారులు మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని 4,63,839 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్‌ రెడ్డి పోటీపడుతున్నారు.

Also Read:కేన్స్‌ ఫెస్టివల్..ఉత్తమ నటిగా అనసూయాసేన్‌

- Advertisement -