కేజ్రీవాల్, సిసోడియా ఓటమి

4
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో ఆప్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆప్ కీలక నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఇద్దరూ ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్‌ చేతిలో 3 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రౌండ్ రౌండ్‌కు ఫలితం మారుతూ రాగా చివరకు ఓటమి పాలయ్యారు కేజ్రీవాల్.

మరో సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి తర్వెందర్ సింగ్ విజయం సాధించారు. 600 ఓట్ల తేడాతో సిసోడియా ఓటమి పాలయ్యారు.

ఇప్పటి వరకు వెల్లడైన వివరాల ప్రకారం బీజేపీకి 48 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 43 శాతం, కాంగ్రెస్‌కి 6.7 శాతం ఓట్‌ షేర్‌ వచ్చింది. కోండ్లీ స్థానం నుంచి ఆప్‌ అభ్యర్థి కుల్‌దీప్‌ కుమార్‌ గెలిచారు.

- Advertisement -