Kejriwal:కేజ్రీవాల్ అరెస్టు ఖాయం..ఎవరిది వ్యూహం!

27
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడం ఖాయమేనా ? అంటే తాజా పరిణామాలు చూస్తే అవునేమో అనే సందేహాలు రాక మానవు. గత కొన్నాళ్లుగా ఢిల్లీ లిక్కర్ స్కాం అప్ నేతలను వెంటాడుతోంది. ఈ కేసులో ఇప్పటికే కొంతమంది అప్ నేతలు జైల్లో ఉన్నారు కూడా. ఇక ఈ కేసులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ కూడా పలుమార్లు నోటీసులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్టు ఖాయమని స్వయంగా అప్ నేతలె చెబుతుండడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరో రెండు లేదా మూడు రోజుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయబోతున్నారని, ఈ విషయంపై తమకు స్పష్టమైన సమాచారం ఉందని అప్ నేత ఢిల్లీ మినిస్టర్ సౌరబ్ భరద్వాజ్ తాజాగా వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్ పై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే పార్లమెంట్ ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్టు అయితే దేశ రాజకీయల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉన్నప్పటికీ కాంగ్రెస్ తో సీట్ల షేరింగ్ విషయంలో అప్ విభేదిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని 7 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్, అప్ విడివిడిగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి.

అయితే విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలి బీజేపీకి ప్లెస్ అవుతుందనే భావనతో మళ్ళీ డెసిషన్ ఛేంజ్ చేసుకొని కలిసే కలిసే పోటీ చేసేందుకు ఆప్, కాంగ్రెస్ సిద్దమైనట్లు వినికిడి. ఈ నేపథ్యంలోఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం గ్యారెంటీ అనేది ఆప్ నేతలు చెబుతున్న మాట. అయితే అప్ నేతలు సెంటిమెంటల్ గా ప్రజల్లో సానుభూతి పొందేందుకే కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లుతు కేజ్రీవాల్ అరెస్టును హైలెట్ చేస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి దేశ రాజకీయాల్లో కేజ్రీవాల్ అరెస్టు అవుతారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:ఆ రెండు గ్యారెంటీలు..ఎప్పటినుంచి అంటే?

- Advertisement -