జైలులో తనను తీవ్రంగా అవమానించే కుట్ర చేశారన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ల సమావేశంలో ఆయన మాట్లాడిన కేజ్రీవాల్…తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలో తనను అవమానించేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తాను జూన్ 5న తీహార్ జైలు నుంచి బయటకు వస్తానని తెలిపారుజ.ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సోమవారం … ఇండియా కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే మెజార్టీ వస్తే జూన్ 5న తాను జైలు నుంచి విడుదలవుతానన్నారు.
తన సెల్‌లో ఉన్న రెండు సీసీటీవీ కెమెరాలను 13 మంది అధికారులు నిరంతరం పర్యవేక్షించేవారని తెలిపారు. ఆ ఫుటేజీని ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా పంపించారని ఆరోపించారు. తనపై మోదీకి అంత అక్కసు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను ప్రజలు ఎంతో గౌరవంగా చూస్తున్నారన్నారు. బీజేపీ మాత్రం ప్రజల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
Also Read:బిలియనీర్లకు మోడీ దాసోహం : రాహుల్