గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న కీసర గ్రామ సర్పంచ్..

204
Keesara Sarpanch
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ మహా ఉద్యమంలా ముందుకు దూసుకుపోతుంది. ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు కీసర గ్రామ సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేష్ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. వాతావరణ మార్పులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి అని అన్నారు.ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటడం ద్వారా వాతావరణ మార్పులను అరికట్టవచ్చని అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగమై మొక్కలు నాటడం ఆనందంగా ఉందని.. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని మాధురి వెంకటేష్ కోరారు.

- Advertisement -