రానాకు నో చెప్పిన కోలీవుడ్‌ భామ..!

429
- Advertisement -

‘మహానటి’మూవీతో ఫుల్‌ క్రేజ్‌ను సోంతం చేసుకుంది కోలివుడ్ బ్యూటి కీర్తి సురేష్‌. ఈ చిత్రం కంటే ముందు గ్లామర్ పరంగానే యూత్‌ను ఆకట్టుకున్న ఈ అమ్మడు ఆ తరువాత నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. స్టార్ హీరోలతో చేసిన సినిమాలు వరుస విజయాలను సాధిస్తూ రావడంతో ఆమె క్రేజ్ పెరుగుతూ వెళ్లింది.

దీంతో తెలుగు,తమిళ భాషల్లో కీర్తికి భారీ ఆఫర్స్‌ వస్తున్నాయి. అయితే మహానటి నుంచి ఆమె కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. అంతేకాదు ఇటిలవ బాలీవుడ్‌ నుండి కూడా అవకాశాన్ని అందిపుచ్చుకుంది.

Keerthy

ఇక అసలు విషయం ఏంటంటే.. హీరో రానా దగ్గుబాటి త్వరలో నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇది ఒక కొరియన్ సినిమాకు రీమేక్ అని సమాచారం. ఈ సినిమా రీమేక్ రైట్స్ ఇప్పటికే రానా తీసుకున్నాడని టాక్‌. ఈ మూవీ మాఫియా నేపథ్యంలో ఉంటుందట.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కీర్తిని సంప్రదిస్తే ఆఫర్‌కు నో చెప్పిందని టాక్. ఏ కారణం వల్ల కీర్తి ఈ ఆఫర్ కు నో చెప్పిందనేది మాత్రం తెలీదు. దీంతో నందిని రెడ్డి టీమ్ మరో హీరోయిన్‌ను వెతికే పనిలో పడ్డారట.

- Advertisement -