మాల‌యాళీ కుట్టిగా మారిన మ‌హాన‌టి..!

416
mahanati
- Advertisement -

మలయాళీ బ్యూటీ కీర్తి సురేష్ సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రంతో ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేగలదని నిరూపించింది. ఈ చిత్రానికి గాను ఆమె నటనకు జాతీయ అవార్డ్ కూడా వచ్చింది. ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం మ‌ల‌యాళంలో ‘మ‌ర‌క్క‌ర్ అర‌బిక‌డ‌లింతే సింహం’ అనే చిత్రంలో న‌టిస్తుంది. మోహ‌న్ లాల్ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, కీర్తి సురేష్ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

keerthi

అయితే ఇందులో కీర్తి మలయాళ కుట్టీగా కనిపించనుంది. తాజాగా ఆ పాత్రకు సంబంధించిన లుక్ రిలీజ్ అయింది. లుక్ పరంగా కీర్తి గురించి చెప్పేదేం ఉంది. బేసిక్ గా మలయాళీ అమ్మాయి కాబట్టి అక్కడి సంస్కృతి సంప్రదాయాన్ని పుక్కిట పట్టింది కీర్తి. ఈ మూవీ ప్రియ‌ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. ప్రస్తుతం కీర్తి ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి.

- Advertisement -