బెల్లంకొండ మరో మాంచి ఐటం ను పట్టాడు..!

234
Keerthy-Suresh-for-Bellamkonda-Srinivas
- Advertisement -

ఎదుగుతున్న క‌థానాయ‌కుల సినిమాల‌కు ప్రేక్ష‌కులు రావాలంటే ఒక్క‌టే మార్గం.. కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్ల‌ను ఎంపిక చేసుకోవ‌డం. ఈ కిటుకు.. యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్‌కి బాగా తెలుసు. స‌మంత‌, త‌మ‌న్నా, ర‌కుల్ ప్రీత్ సింగ్ వంటి క్రేజీ హీరోయిన్ల‌తో త‌న గ‌త సినిమాల్లో క‌లిసి న‌టించిన ఈ నిర్మాత త‌న‌యుడు ప్ర‌స్తుతం పూజా హెగ్డేతో ‘సాక్ష్యం’ సినిమా చేస్తున్నాడు.

Keerthy-Suresh-for-Bellamkonda-Srinivas

ఈ సినిమా పూర్త‌య్యేలోపే ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించనున్నాడు శ్రీ‌నివాస్‌. స్పోర్ట్స్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో క‌థానాయిక‌గా కీర్తి సురేష్ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని తెలిసింది. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమాలో నటించిన కీర్తి ఇపుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో జతకట్టబోతోంది. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమాలో నటించిన కీర్తి ఇపుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో జతకట్టబోతోంది. ఈ సినిమా కోసం బెల్లంకొండ ఆమెకు ఏకంగా కోటి 25 లక్షలు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని సమాచారం.

Keerthy-Suresh-for-Bellamkonda-Srinivas

హీరోయిన్లకు భారీ పారితోషికాలు చెల్లించడం బెల్లంకొండకు కొత్త విషయమేమీ కాదు. ఆయన అనుకున్నట్లుగా కీర్తిని హీరోయిన్ గా ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాక్ష్యం సినిమా షూటింగ్ పూర్తవగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

- Advertisement -