మహేష్‌ వద్దన్నా..నో టెన్షన్‌

326
- Advertisement -

ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్స్ అంటే సమంత, రకుల్, కాజల్, అనుష్క, తమన్నా, శృతి ఈ ఆరుగురే గుర్తుకు వస్తారు. స్టార్ హీరో సినిమా అంటే ఈ ఆరు మోహలే కనబడతాయి. కానీ ఇప్పుడు సీన్ మారబోతోంది. స్టార్ హీరోయిన్ల లీస్ట్ లోకి తర్వలోనే ఓ ముద్దు గుమ్మ వచ్చి చేరబోతోంది. ఆమేనే కీర్తి సురేష్‌. ప్రజెంట్ రైసింగ్ స్టార్ అంటే అమ్మడు పేరే చెప్పుకోవాలి.
 keerthy suresh crazy movie offer in tollywood
ఇదిలాఉంటే.. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట కీర్తి సురేష్‌ను అనుకున్నారు. అయితే ఆమె డేట్స్ క్లాష్ అవుతున్న కారణంగా ఆమెను పక్కన పెట్టి ఆ స్థానంలో కైరా అద్వానీని ఎంపిక చేసుకున్నారు. మహేష్ లాంటి స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ మిస్ చేసుకోవడం అంటే ఒకరకంగా ఇబ్బంది పడే విషయమే.
 keerthy suresh crazy movie offer in tollywood
కానీ కీర్తికి విషయంలో బెంగ పడాల్సిన అవసరం లేదు. ఆమెకు వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం పవన్ సినిమాలో నటిస్తోన్న కీర్తి, సావిత్రి జీవిత కథతో రూపొందిస్తోన్న సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోంది. అలానే తమిళంలో సూర్య, అజిత్, విజయ్ వంటి టాప్ హీరోలతో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఇటీవల విక్రమ్ సరసన ‘సామి2’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది కీర్తి. తమిళంలో కీర్తి అంత బిజీ హీరోయిన్ ప్రస్తుతం మరొకరు లేరు. ఇక తెలుగులో ఆమె నటిస్తోన్న పవన్ సినిమా విడుదలైన తరువాత ఆమె క్రేజ్ మరింత పెరగడం ఖాయం. నేను శైలజ, నేను లోకల్ సినిమాలతో హిట్స్ అందుకున్న కీర్తి లిస్ట్‌లో ఓ పెద్ద హిట్ పడితే మాత్రం ఈ అమ్మడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ అయినట్టే.

- Advertisement -