సెక్స్‌ సీన్లపై సెన్సేషనల్ కామెంట్స్..

212
avasarala srinivas sensational comments
- Advertisement -

హిందీలో హంటర్ సినిమా సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. పూర్తిగా ఒక బోల్డ్ కథతో వచ్చిన సినిమా ఇది. సమాజంలో అక్రమ సంబంధాలు… వాటి పర్యవసానాలను కొంచెం రొమాంటిక్‌గా వివరిస్తూ ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించాడు.

ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో అవసరాల శ్రీనివాస్ హీరోగా ‘బాబు బాగా బిజీ’ పేరుతో దర్శకుడు మేడారం నవీన్ తీశాడు. ఇవాళ ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అవసరాల చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌‌గా మారాయి.
avasarala srinivas sensational comments
బాబు బాగా బిజీ’ చిత్రం చేయడం ఏదో చేయరాని నేరం అన్నట్టుగా అందరూ మాట్లాడుతున్నారని, తన ఇమేజ్‌ పర్మినెంట్‌గా డ్యామేజ్‌ అయిపోతుందని భయపెడుతున్నారని అవసరాల శ్రీనివాస్‌ అన్నాడు. తెరపై ఒక నలభై మర్డర్లు చేసిన వాడిని నిజ జీవితంలో కిల్లర్‌ అంటారా? విలన్‌లా చూస్తారా? మరి తెరపై శృంగార దృశ్యాల్లో ‘నటించిన’ వారిని చిన్నచూపు ఎందుకు చూడాలి? వారిపై ఎందుకు ‘చీప్‌’ అనే ముద్ర వేయాలి అని ప్రశ్నిస్తున్నాడు.
avasarala srinivas sensational comments
‘బాబు బాగా బిజీ’లాంటి చిత్రం చేస్తున్నావని తెలిసి మీ తల్లిదండ్రులు ఏమన్నారు? అని కొందరు అడుగుతున్నారని, ఇది ఒక సినిమా అని, కేవలం నటించానని ఎందుకు గుర్తించడం లేదు అంటూ అవసరాల అడుగుతున్నాడు. ఆ సినిమాలో ‘నా స్కోరెంత’ అని అడిగే సీన్‌ వుండడంతో నిజ జీవితంలోను తనని ఆ ప్రశ్న అడిగేయవచ్చునని కొందరు భావిస్తున్నారని, అలా అడిగిన వాళ్లు కూడా వున్నారని ఆశ్చర్యపోయాడు.

తన వరకు నటుడిగా ఛాలెంజ్‌ చేసే పాత్రలు వచ్చినపుడు ఖచ్చితంగా చేస్తానని, బాబు బాగా బిజీ ఆడినా, ఆడకపోయినా ఇది చేయడం పట్ల రిగ్రెట్‌ అవనని, అలా అని ఇకపై అన్నీ ఇలాంటి పాత్రలే చేస్తానని అనడం లేదని చెప్పాడు. బాహుబలి తర్వాత రిలీజ్‌ చేస్తున్నామని కొందరు భయపెడుతున్నారని, కానీ ఇది సరయిన సమయమని తన నిర్మాతలు, బయ్యర్లు భావిస్తున్నారని, ఆ రంగంలో వారికి అనుభవం వుంది కనుక వారి నమ్మకాన్ని నమ్ముతానని, ఇది కమర్షియల్‌గా వర్కవుట్‌ అయ్యే సినిమా అని నమ్ముతున్నానని చెప్పాడు.

- Advertisement -