‘భోళా శంకర్’ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి కీర్తి సురేష్ చెల్లెలుగా నటించడం తెలిసిందే. తాజాగా కీర్తి సురేష్ ఈ సినిమా గురించి, మెగాస్టార్ గురించి బోలెడు విషయాలు చెప్పుకొచ్చింది. భోళా శంకర్ చిత్రంలో తనది చెల్లి పాత్ర కావడంతో మెగాస్టార్ చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం రాదేమోనని భయపడ్డానని హీరోయిన్ కీర్తి సురేష్ తెలిపింది. అయితే, సంగీత్ పాటలో తామంతా కలిసి డాన్స్ చేశామని, తన కోసం కావాలని ఆ పాట సినిమాలో ఇరికించారని, ఆ సాంగ్ చాలా బాగా వచ్చిందని కీర్తి సురేష్ చెప్పింది. చిరంజీవి నుంచి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకున్నానని చెప్పింది.
అలాగే, హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ జరిగినన్ని రోజులో చిరంజీవి ఇంటి నుంచే తనకు రోజూ భోజనం వచ్చేదని.. మొదట్లో తనకి ఏం కావాలో చిరంజవీ అడిగేవారని, ఆ తర్వాత తానే అన్ని అడిగి మరీ తెప్పించుకొనే దాన్ని అని కీర్తి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. చిరు ఇంటి నుంచే వంటకాల్లో ఉలవచారంటే తనకు చాలా ఇష్టమని కీర్తి సురేష్ తెలిపింది. మెహర్ రమేశ్ స్పష్టతున్న దర్శకుడని, తనకేం కావాలో అది రాబట్టగలిగే సామర్థ్యం ఉన్నవాడని హీరోయిన్ కీర్తి సురేష్ చెప్పింది.
మెహర్ సెట్లో తనని ఒక చెల్లెలుగా చూసుకొనేవారని, భోళా శంకర్ సినిమాతో మెహర్ రూపంలో తనకి ఒక అన్న దొరికాడని తెలిపింది. తమన్నా కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందని, తను సెట్లో అందరితో చాలా సరదాగా ఉంటుందని కీర్తి చెప్పింది. భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా కీర్తి సురేశ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజుల్లో అద్భుతమైన నటి కీర్తి. మా ఇంటి బిడ్డలా అనిపిస్తుంది అని చెప్పారు.
Also Read:ఎంపీగా రాహుల్..నోటిఫికేషన్ జారీ