ఎఫైర్ల పై కీర్తి సురేష్‌ తొలి రియాక్షన్

45
- Advertisement -

హీరోయిన్ కీర్తి సురేష్‌ ప్రేమ,పెళ్లి అంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఓ వ్యాపార వేత్తతో త్వరలో కీర్తీ సురేష్‌ పెళ్లి కాబోతుందని బాగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై కీర్తీ సురేష్ తల్లి మేనక ఇప్పటికే స్పందించారు. కీర్తీ పెళ్లిపై వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. కీర్తీ ఎవరిని ప్రేమించినా తమకు చెబుతుందని, దాన్ని తాము మీడియా ద్వారా వెల్లడిస్తామని ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, కీర్తి సురేష్‌ పై పుకార్లు ఆగడం లేదు. రోజురోజుకు కీర్తి సురేష్‌ ప్రేమ పై రకరకాలుగా అనేక వార్తలను వైరల్ చేస్తూనే ఉన్నారు.

Also Read:ఎమోషనలైన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌

నిజానికి ఈ పుకార్లకు ఓ కారణం ఉంది. ఇటీవల పర్హాన బీన్ లియాకత్‌ అనే వ్యక్తితో కీర్తి సురేష్ చెట్టాపట్టాలు వేసుకొని తిరిగింది. ఏం లేకపోతేనే.. ఏదో ఉందని క్రియేట్ చేసే మన గాసిప్ రాయుళ్లకు ఈ వార్త మంచి కిక్ ఇచ్చింది. దాంతో, రియల్ ఎస్టేట్ వ్యాపారి పర్హాన బీన్ లియాకత్‌ తో కీర్తి సురేష్ డేటింగ్ చేస్తోందని.. ఇప్పటికే వీరి మధ్య ఎఫైర్ చాలా దూరం వెళ్ళిందని, కీర్తి సురేష్ గర్భవతి కూడా అంటూ మంచి స్పైసీ కంటెంట్ ను వైరల్ చేస్తున్నారు. ఇవన్నీ చూసి విసిగిపోయిన కీర్తి సురేష్ మొత్తానికి మొదటిసారి ఈ వార్తల పై రియాక్ట్ అయింది.

Also Read:హ్యాపీ బర్త్ డే..చంద్రమోహన్

కీర్తి సురేష్ మాటల్లోనే.. ‘‘జీవితంలో మిస్టరీ మ్యాన్ వస్తారంటూ చెప్పేసిన కీర్తి.. ఈసారి నా బెస్ట్‌ ఫ్రెండ్‌ను వార్తల్లోకి లాగేశారని అన్నారు. నిజమైన మిస్టరీ మ్యాన్‌ను టైం వచ్చినప్పుడు పరిచయం చేస్తా. అప్పటివరకూ చిల్‌గా ఉండండి. ఒక్కసారి కూడా నా లవ్ గురించి సరైన వార్తలు, నిజమైన వార్తలు రాలేదు.” అంటూ కీర్తి సురేష్ ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ ను బట్టి ఆమె పై ఇప్పటివరకూ వచ్చిన వార్తలన్నీ పూర్తి అవాస్తవం అని అర్ధమవుతుంది.

- Advertisement -